SAKSHITHA NEWS

ఘనంగా స్వర్గీయ శ్రీ దరిపల్లి అనంతరాములు గారి జయంతి ఉత్సవాలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ – ఖమ్మం, వాణి ఐటిఐ – ఖమ్మం, గౌతమ బుద్ధ మైనారిటీ ఐటిఐ ఇల్లందు మరియు అనుబంధ విద్యా సంస్థలు అయినటువంటి వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ , వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కృషి ఐటిఐ, శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల, శ్రీ సాయి కృపా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, భువనగిరి నందు స్వర్గీయ శ్రీ దరిపల్లి అనంత రాములు జయంతి ఉత్సవాలను ఘనంగా విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు. కళాశాలల వ్యవస్థాపకులు దరిపల్లి అనంతరాములు ని స్మరించుకుని దరిపల్లి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల అధినేత డాక్టర్ దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ, వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మరియు దరిపల్లి ప్రవీణ్ కుమార్ గారూ మాట్లాడుతూ
స్వర్గీయ దరిపల్లి అనంత రాములు చిన్న స్థాయి నుండి ఉమ్మడి నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలలో అనేక విద్యాసంస్థలు స్థాపించి పేద మరియు మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యని తక్కువ ఫీజుతో అందించి వారి యొక్క ఉపాధికి బాటలు వేసినారు. తమ విద్యాసంస్థలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలలో స్థిరపడ్డారు అని అన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఒక బీసీ నాయకుడుగా ఉమ్మడి నల్లగొండ మరియు ఖమ్మం జిల్లాలో అనేక కృషి చేశారు. వారి ఆశయ సాధనకై తాము అహర్నిశలు విద్యాసంస్థల అభ్యున్నతికి తమ వంతు కృషి చేసి వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేశారు. ఇంతింతై, వటుడింతై అనుచందంగా తన అభ్యున్నతి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు.

దరిపల్లి విద్యాసంస్థల అధినేత పేద విద్యార్థుల పాలిట విద్యా ఆశాజ్యోతి దరిపల్లి అనంత రాములు జయంతి ఉత్సవాల సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కిరణ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒకరు కష్టపడి ఇష్టంగా చదవాలని కీర్తిశేషులు దరిపల్లి అనంత రాములు జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని కష్టపడితే జీవితంలో వచ్చే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని దేనినైనా సాధించే సత్తాను మన యొక్క కష్టపడేతత్వంతోనే సాధించగలమని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ఫ్యాకల్టీ అధ్యాపకేతర విద్యార్థిని విద్యార్థులు లాలు ప్రవీణ్ వెంకట్ మరి విద్యార్థులు గణేష్ రామ్ చరణ్ వీరన్న శ్రీధర్ రామ్ ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి లోని రోగులకు బ్రెడ్స్, పండ్లు పంచినారు.

ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల యాజమాన్యం తరుపున కరస్పాండెంట్ స్వాతి,గందే అప్పారావు, ప్రిన్సిపల్ డాక్టర్ డి కిరణ్, ఫ్యాకల్టీ లాలూ, ప్రవీణ్, మూర్తి సార్, సందీప్, ప్రసన్న వెంకట్, సీత,విద్యార్థిని మరియు విద్యార్థులు తో పాటు వాణి ఐటిఐ ప్రిన్సిపల్ తాజుద్దీన్, ప్రవీణ్, భరత్, కృష్ణమూర్తి, ప్రభాకర్, దండు వెంకటేశ్వర్లు గౌతమ బుద్ధ మైనారిటీ ఐటిఐ ఇల్లందు అస్మత్, అనిల్, బి అనిల్, రామ్కీ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS