SAKSHITHA NEWS

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

దొడ్డి కొమురయ్య 96వ జయంతిని పురస్కారించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్, ప్రొభిషనర్ ఐపిఎస్ అధికారి అభినాష్ కుమార్ పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
తెలంగాణలో భూ స్వామ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి, ఏ ఓ అక్తరునీసబేగం, అర్ ఐ సాంబశివరావు, సిఐలు సాంబరాజు, తమ్మ గోపి, పాల్గొన్నారు.


SAKSHITHA NEWS