SAKSHITHA NEWS

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గ్రీవెన్స్ డే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ తో కలిసి, గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ, సంబంధిత శాఖ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామం నుండి మెట్టు రాము, తనకు డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరుకు కోరగా, ఆర్డీవో ఖమ్మం నకు పరిశీలించి చర్యలకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలం చేరువుమాధారం నుండి జి. యోహాను, తనకు ఆసరా పెన్షన్ మంజూరుకు దరఖాస్తు చేయగా, డిపిఎం ను తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. కూసుమంచి మండలం, జక్కేపల్లి గ్రామం నుండి కె. వెంకన్న, తనకు ఏప్రిల్, 2022 నుండి దివ్యాoగుల పెన్షన్ నిలుపుదల చేశారని, విడుదల చేయగలందులకు దరఖాస్తు చేయగా, డిఆర్డీవో ను తగుచర్యకై ఆదేశించారు. కొణిజేర్ల మండలం చిన్నగోపతి నుండి జి. శ్రీను అకాల వర్షానికి తన మొక్కజొన్న చేను పడిపోయిందని, న్యాయం చేయగలందులకు కోరగా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. వైరా లో శాంతినగర్ నుండి జాన్ పాడ్ దర్గా ఎన్ఎస్పి కాల్వ ఆక్రమణకు గురైందని, తగుచర్యకై అక్కడి గ్రామస్తులు కోరగా, మండల తహసీల్దార్ ను తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. సత్తుపల్లి మండలం తాళ్ళమడ గ్రామం నుండి ఏ. సత్యనారాయణ, బెతుపల్లి గ్రామ రెవిన్యూ దాఖలాలో ఉన్న సర్వే నెం. 878 టు 938/1/35 లో 0.17 కుంటల భూమి ధరణి లో నిషేధిత భూముల జాబితాలో ఉందని, దానిని తొలగించి, తన తల్లి మరణించినందున వారసత్వ బదిలీ చేసుకొనుటకు అనుమతికై కోరగా, తహసీల్దార్ కు తగుచర్యకై ఆదేశించారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం నుండి ఏ. వీరభద్రం సర్వే నెం. 17 లోని తన 0.14 కుంట భూమిలో సర్వే నెం. తప్పుగా పడిందని, తగుచర్యకై కోరగా, తహసీల్దార్ ను తగుచర్యకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి గ్రామం నుండి దోమకుంట శారద, తనకు ఏదేని శాఖలో అటెండర్ లేదా స్వీపర్ ఉద్యోగం ఇప్పించగలందులకు దరఖాస్తు చేయగా, జిల్లా ఉపాధికల్పనాధికారిని పరిశీలనకై అదనపు కలెక్టర్ ఆదేశించారు. రిక్కా బజార్, ఖమ్మం నుండి మహ్మద్ అఫ్జల్, తనకు పాకబండ పరిధిలోని సర్వే నెం. 26/అ, 27/అ, 34/ఏ/1 లో 2.02 కుంటల భూమి వ్యవసాయ భూమి అయినప్పటికీ, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర భూమిగా నమోదు అయిందని, మార్పు చేసి, కొత్త పట్టాదార్ పుస్తకం ఇప్పించగలందులకు కోరగా, తహసీల్దార్ ను విచారణ కు అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS