SAKSHITHA NEWS

శ్రీరామనవమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని బాచుపల్లి కౌసల్య కాలనీ, మల్లంపేట్, బోరంపేట్, సారెగూడెం, దుండిగల్, కొంపల్లి జయభేరి లలో శ్రీరామ నవమి సందర్బంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సీతారాముల ఆశీర్వాదం ప్రజలందరి పై ఉండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీల సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS