అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు