తుమ్మల రాజకీయ నిరీక్షణ-అభిమానులలో అంతర్మథనం”
అభివృద్ధి ప్రధాతకు అన్యాయం జరిగింది అనే భావనలో పాలేరు ప్రజలు”
లోడిగ వెంకన్నయాదవ్. సామాజిక వెత్త. పాలేరు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
40సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు నాలుగు సంవత్సరాలు గా రాజకీయ నిరీక్షణ తో మౌన ముద్ర దాల్చడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎప్పుడు ప్రజలగురించి ఆలోచించి అభివృద్ధి ని పరుగులు పెట్టించే వ్యక్తి మౌనం వెనుక ఆంతర్యం అర్థం కాక అభిమానులలో అంతర్మథనం మొదలైంది. అభిమానులు ఇలా అంతర్మథనంలో , ఆందోళనలలో ఉండటానికి కూడ ఒకకారణం ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబం ను సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి బలమైన కాంగ్రెసుపార్టీ ని ఎదుర్కొంటు జిల్లా లో తనకంటూ ఒక రాజకీయ ముద్రవేసుకొని ,జిల్లాలోకాంగ్రెస్ ను ఎదుర్కొనుటకు వామపక్ష పార్టీల తో కలిసి పనిచేసి జిల్లాను విశాలమైన రాహదార్లు , సాగునీరు త్రాగునీరు ,మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పదంలో జిల్లా ను ముందుండి నడిపించిన ఘనత తుమ్మలది. అందుకే అభివృద్ధి ప్రదాత అనే నామకరణం సార్థకత చేసుకొన్న వ్యక్తి గా ఖమ్మం జిల్లా చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించి సార్థకత చేసుకొన్నారు. ప్రజలు కూడ అదే కృతజ్ఞతతో తన వెంట నడిచారు. దానికి అనుగుణంగా నే అప్పటి టి.ఆర్. యస్ కు ఒక్క యం.పి.టి.సి కూడ లేని జిల్లాలో ఖమ్మంజిల్లా అభివృద్ధి ని ఆకాంక్షించి ఖమ్మం జిల్లాను గులాబీ మయంచేసి కేసీఆర్ కు కానుకగా ఇచ్ఛారు.
యం.యల్. సి.ని బహుమతి గా అందజేశారు. జిల్లా నలుమూలల గులాబీ జెండా రెపరెప లాడించారు.ఇది చరిత్ర. అటువంటి వ్యక్తిని కొందరు రాజకీయ సొలాభం కొసం కనిపించని రాజకీయ కుట్రలతో ఒక సామాజిక వర్గం కులరాజకీయ కుట్రలో పాలేరు లో ఓడించి న విషయం బహిరంగ రహస్యమే. ఎందుకంటే కేసీఆర్ యే స్వయంగా పాలేరులో మమ్మల్ని మేమే చంపుకున్నాము అని తుమ్మలను ఉద్దేశించి ఆనాడు అన్నారు. నన్ను ప్రజలు ఓడించలేదు కొంతమంది స్వార్థ రాజకీయాలకోసం నన్ను ఓడించారు అని సాక్షాధారాలతో సహ తుమ్మల రాష్ట్ర పార్టీ దృష్టికి, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇంత జరిగిన తుమ్మల పార్టీ లైను దాటి ఏనాడు ప్రవర్తించలేదు.ఎందుకంటే నేను కేసీఆర్ ను నమ్మాను.నాకు ద్రోహం చేయడు అని తాను నమ్ముతు ఇంతకాలం తన అభిమానులను నమ్మిస్తు కార్యకర్తలను తన వెంట ముందుకు నడిపిస్తూ వచ్ఛారు. కాని కార్యకర్తలలో ఓపిక నశించి మన నాయకుడి రాజకీయ భౌవితవ్యం ఏమిటి, సుదీర్ఘ 40 సంవత్సరాల అనుభవం వృధా కావటమేనా ,తన చిరకాల కోరిక సీతారామప్రాజక్టు ద్వారా గోదావరి జలాలు పాలేరు కు రప్పించే తన జీవిత లక్ష్యం నెరవేరేనా అనే అంశాలపై తుమ్మల అభిమానులలో అంతర్మథనం మొదలైందనేది నిజం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని 40 సంవత్సరాలు ఎదుర్కొని ఎదురొడ్డి పోరాడి జిల్లా లో పనిచేసిన వ్యక్తి పాలేరు లో కుట్ర పూరిత రాజకీయాకు బలై ఓటమి చెందిన ప్రజలగుండెల్లో నిలిచిన వ్యక్తి తుమ్మల. ఊహించని పరిణామాలతో కాంగ్రెస్ లో తనమీద గెలిచి పాలేరు రాజకీయాలు మొత్తం తన ముందు నడిపిస్తుంటే చూస్తూ ఊరకుండటం తుమ్మల అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వలస వచ్ఛిన యం.యల్ ఏ. లకు ఏపార్టీనుండి వచ్ఛారు అన్నది ప్రమేయం లేకుండా పార్టీ పాలసీ ఈవిధంగా డిజైన్ చేయబడ్డది.అప్పటి వరకు నాయకత్వం వహించిన ,ఓడిపోయిన యం.యల్ .ఏ.లకు పార్టీ లో ప్రాదాన్యత లేకుండా వలస వచ్ఛిన యంయల.ఏ కు సంపూర్ణ అదికారం ,పార్టీ కార్యక్రమంలో , అధికారక కారిక్రమమునకు ఆ నియోజకవర్గ యంయల్ ఏ లకు పట్టంకట్టే విధంగాపార్టీ పాలసీ అమలుచేశారు కేసీఆర్. ఇంతటి ఘోరమైన రాజకీయ నీలినీడలు తనచుట్టు అలుముకొని ఉన్నా , కుట్ర రాజకీయాలకు బలైపోయిన, పాలేరు పార్టీ రాజకీయ సమావేశం నకు పిలుపు లేక పోయినా ,తాను పుట్టిన నియోజకవర్గం సత్తుపల్లి లోకి వచ్ఛి తనపై రాజకీయాలు చేస్తున్న, ఖమ్మం నియోజకవర్గం లో ఒక సారి గెలిచి ఖమ్మం పట్టణ స్వారూపాన్ని మార్చినా ,సత్తుపల్లి లో ,ఖమ్మం లో ,పాలేరు లో తన ఉనికి కి భంగం కలిగేలా కొందరు ప్రవర్తిస్తుంటే లక్షల మంది కార్యకర్తలుజిల్లాలో ఉండి, ఎందరో అభిమానులు కలిగి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగలిగిన సత్తా దమ్ము ఉన్న వ్యక్తి రాజకీయ మౌన ముద్ర దాల్చడం ,రాజకీయ నిరీక్షణ తుమ్మల అభిమానులకు ,కార్యకర్తలకు రుచించడంలేదు. ఒక ప్రక్క షర్మిల, మరోప్రక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పాలేరు పై రాజకీయ రంకెలు వేస్తుంటే సందట్లో సడేమియా అన్నట్టు వామపక్షాలు మేము పోటీచేస్తామంటుంటే ,పాలేరు సీటు నాదే అని కందాల ఉపేందర్ రెడ్డి చెపుతుంటే మన నాయకుడి లైనేంటి అని తుమ్మల అభిమానులు ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. ఇలా తుమ్మల అభిమానులు అంతర్మథనంలో ఉండటానికి బలమైన కారణం ఉంది.
తుమ్మల అభిమానులుకు గాని ,తుమ్మల కార్యకర్తలకు గాని పాలేరు లో ఏవక్కరికి పార్టీ పిలుపు లేదు. మనం బీఆర్ యస్ లో నే ఉన్నామా అనే సందేహం తుమ్మల అభిమానులకు కలుగుతోంది. పాలేరు బిఆర్ యస్ లో ఒక వర్గం తోటే రాజ్యమేలుతున్నారు అనేది సత్యం. కనీసం దళిత భౌజన కులాలు సైతం రాజకీయ పదవులకు ,పార్టీ నాయకత్వం నకు ఆమడదూరంలో ఉన్నారుఅన్నది నిజం. పార్టీ పిలుపులేక ,మానాయకుడికి ఆదరణలేక , రాజకీయకుట్రలకు బలియైపోయి,పదవులకు దూరమై , పాలేరు అభివృద్ధి కి నోచుకోక ఎవరికొరకు మనం పార్టీ లో ఉన్నామో అనే మీమాంసలో కార్యకర్తలు ఉన్నారు. మన నాయకుడు తుమ్మల రాజకీయ నిరీక్షణ చేస్తున్నారు అనే అంతర్మథనంలో తుమ్మల అభిమానులు ఆలోచన లో పడ్డారు. తుమ్మల మౌనం వీడి రాజకీయ వేడిని పెంచాలి అని పాలేరు ప్రజలు కోరుకొంటున్నారు. ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాలు అభివృద్ధి ఏపాటిదో ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. తుమ్మల ఉంటే అభివృద్ధి మరోలా ఉండేది అనే మాట పాలేరు లో ఆనోటా ఈనోటా వింటున్నాము. రాజకీయ కుట్ర తో తుమ్మలకు అన్యాయంజరిగింది అనే భావంతో పాలేరు ప్రజలు ఉన్నారు.
ఇలాంటి తరుణంలో తమ్మల పార్టీ లైనులో వేగం పెంచుతారా లెదా సొంత నిర్ణయం తీసుకొంటారా అనే మాటలు వినపడుతున్నాయి. ఇలా మౌనంగా ఉంటే తొక్కుకుంటుపోతారు తప్ప తట్టి లేపేవారు ఉండరు రాజకీయాలలో. కెసిఆర్ ను నమ్ముకొన్నాను నాకు అన్యాయం చేయడు అని మీరుఅనుకొంటే నాలుగు సంవత్సరాలు గా అవమానం అన్యాయం జరుగుతూనే ఉంది అది భరిస్తూ చూస్తూనేఉన్నారు మీరు మరియు కార్యకర్తలు. ఇక ముందు కూడ ఆదే జరుగుతుంది అనే భావనలో తుమ్మల అభిమానులు ,కార్యకర్తలు ఉన్నారు.ఇది నిజం కాదు అని అటు పార్టీ కాని , మీరు కాని నిరూపించడానికి సమయం ఆసన్నమైంది. మీరు ఏనిర్ణయం తీసుకొన్నా మీ అభిమానులు, కార్యకర్తలు మీ వెంట సిద్దంగా ఉన్నారన్నది నిజం. ఎందుకంటే మీ వెంట జనభలం అనేక పర్యాయాలు ఋజవైంది. పార్టీ లో తుమ్మల అభిమానులుగా ప్రాదాన్యత లేక పార్టీ లో పిలుపు లేక అవమాంతో అభిమానులు ఊగిపోతున్నారు. మీ మౌనంతో అంతర్మథనంలో ఉన్నారు. పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు తప్ప. నూతన తెలుగు సంవత్సరం శుభం జరగాలని కార్యకర్తలు కోరుకొంటు న్నారుపార్టీ లో దూకుడు పెంచాలని అది కుదరకపోతే వేరే కుంపటికి సైతం వెనకాడరాదని కార్యకర్తలు కోరుకొంటున్నారు.
,,,,,,,,,,,,,,,,,