SAKSHITHA NEWS

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నాం.
అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజు.
అసెంబ్లీ చరిత్రలో సభలో ఎమ్మెల్యేలపై దాడి ఎప్పుడు లేదు.
దళిత శాసన సభ్యుడు స్వామి పై దాడి దుర్మార్గం.
శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు.
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి ప్రజాస్వామ్యం పై దాడి చేయడమే.
అసెంబ్లీలో ఎమ్మెల్యే లకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?
జగన్ ప్రాపకం కోసం, మరలా ఎమ్మెల్యే సీటు కోసం సుధాకర్ దిగజారి ప్రవర్తిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ నేతలు ఆత్మరక్షణ లో పడ్డారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
ప్రజలు వైసీపీ కి తగిన గుణపాఠం నేర్పుతారు.

డాక్టర్ నూకసాని బాలాజీ తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు,
జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్.

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి ప్రజాస్వామ్యం పై దాడి చేయడమేనని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యఅని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లపై దాడిని తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసానిబాలాజీ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ చరిత్రలోనే ఈరోజు చీకటి రోజు అని, శాసనసభ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క ఎమ్మెల్యే పై దాడి జరిగిన ఘటన లేదని, ఇటువంటి అప్రజాస్వామికి చర్యలు వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని ఆయన దుయ్యబట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్.ఎన్. పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మరలా ఎమ్మెల్యే టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ప్రాకులాడుతూ శాసనసభలో దిగజారి ప్రవర్తించారని నూకసాని బాలాజీ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో వైసీపీ నేతలు ఆత్మ రక్షణ ధోరణిలో పడ్డారని, అందుకు బరితెగించి ప్రవర్తిస్తున్నారని నూకసాని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని నూకసాని ఆవేదన వ్యక్తంచేశారు. విపక్ష, ప్రజాస్వామ్య సంఘాల గొంతు నొక్కే జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో స్పీకర్ గారితో మాట్లాడుతున్నారని, ఆ సమయంలో ఎమ్మెల్యే స్వామి పై దాడి చేయడమే, దొంగే దొంగ దొంగ అన్నట్లు మాపై దాడి చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న విషయం వైసిపి నేతలు మర్చిపోతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు బుద్ధి చెప్పారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలు తగు రీతిలో గుణపాఠం చెప్తారని నూకసాని బాలాజీ హెచ్చరించారు.


SAKSHITHA NEWS