ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సంస్థలతో నిర్వహించిన అంతర్గత సర్వే

Spread the love

హైదరాబాద్‌, : ప్రధాన ప్రతినిధి: మంత్రులు, శాసన సభ్యుల పనితీరు ప్రజల్లో వారికున్న విశ్వాసం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివిధ సంస్థలతో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని తెలుస్తోంది.
ప్రతి మూడు మాసాలకొకసారి రాష్ట్రంలోని పార్టీ ఎమ్మె ల్యేల పనితీరుపై నిఘావర్గాలతో పాటు- ఆయా సంస్థ లతో సర్వే నిర్వహించి అందులో వచ్చిన ఫలితాల ఆధా రంగా శాసనసభ్యుల పనితీరును మార్చుకోవాలని స్వయంగా సీఎం కేసీఆర్‌, భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీ- రామారావులు వారిని పిలిచి దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుతుం టారు. సాధారణంగా ప్రతి ఏటా నాలుగు దఫాలు, కొన్ని సమయాల్లో రెండు నెలలకొకసారి వివిధ ఏజెన్సీల ద్వారా సర్వే రూపంలో సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు.

ఇందుకు సంబంధించిన ప్రశ్నావళిని స్వయంగా సీఎం కేసీఆరే రూపొందించి ఇస్తారన్నది పార్టీలో ప్రచారం ఉంది. అయితే ఈ ఏడాది చివరిన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వీలుగా జనవరి నుంచి ఫిబ్రవరి 5వ తేదీవరకు ఈ సర్వే నిర్వహించగా వాటి ఫలితాలు రెండు రోజుల క్రితం సీఎంకు చేరినట్టు- సమాచారం.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page