మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జి ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జి ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు

SAKSHITHA NEWS

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జి ప్రథమ వర్ధంతి కార్యక్రమాలు

బాబ్జి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాని, వైసిపి నాయకులు దుక్కిపాటి శశిభూషణ్

పదిమందికి మంచి చేసే వ్యక్తులు, మరణించిన తర్వాత కూడా అమర జీవులుగా ప్రజా హృదయాల్లో నిలిచి ఉంటారన్న ఎమ్మెల్యే కొడాలి నాని


సాక్షిత గుడివాడ: గుడివాడ పెద్దఎరుకపాడులో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జి ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను ఆయన అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని, వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్, వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పార్టీ సీనియర్ నాయకులు పాలేటి చంటి, మండలి హనుమంతరావు పలు రాజకీయ పార్టీల నాయకులు బాబ్జి చిత్రపటానికి పూల మాలలతో నివాళులు అర్పించి, ఆయనతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

తనకు ఆత్మీయ సోదరుడైన అడపా బాబ్జి మరణాన్ని నేటికీ తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఎమ్మెల్యే కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు. పదిమందికి మేలు చేసే వ్యక్తులు భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారు చేసిన మంచి మన పనుల ద్వారా అమరజీవులుగా నిలిచే ఉంటారని, అలాంటి మహానీయుల్లో అడపా బాబ్జి తప్పక ఉంటారని ఎమ్మెల్యే నాని అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడపా పండు, అలంకార్ శేఖర్, పాలడుగు రాంప్రసాద్,సిఐలు రామకృష్ణ, తులసీదర్, గోవిందరాజులు, పట్టణ టిడిపి అధ్యక్షులు దింట్యాల రాంబాబు, ప్రముఖ వ్యాపారవేత్త కీర్తి కుమార్ జీవావత్, కొడాలి నాని యూత్ నాయకులు అద్దేపల్లి పురుషోత్తం, తోట సాయికుమార్, పలు రాజకీయ పార్టీల నేతలు, అడపా బాబ్జి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నేతలు, బాబ్జి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి