కాకాణి సమక్షంలో పలు ఒప్పందాలు”
సాక్షిత : విశాఖపట్నంలో నిర్వహిస్తున్న GIS-2023 (గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్- 2023) 2వ రోజున మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో పలువురు పారిశ్రామికవేత్తలు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలతో పాటు, ప్రకృతి వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ విభాగాలలో సుమారు 55 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ముందుకు రావడం పట్ల మంత్రి కాకాణి హర్షం వ్యక్తం చేస్తూ, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా అండగా నిలిచి, సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల నమ్మకంతో, విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు మంత్రి కాకాణి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.