ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షిత కర్నూలు జిల్లా
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
కర్నూలు, మార్చి 1: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కి వివరించారు.బుధవారం విజయవాడ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ స్లిప్స్ ప్రింటింగ్,పంపిణీ, మెటీరియల్ ప్రోక్యూర్మెంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ, వెబ్ కాస్టింగ్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, బందోబస్త్ ప్లాన్, ఆధార్ కలెక్షన్, పోస్టల్ బ్యాలెట్, కౌంటింగ్ ట్రైనింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణపై చేపట్టిన చర్యలను సీఈవో కు వివరించారు.జిల్లాలో గ్రాడ్యుయేట్ ,టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 67024 మంది ఓటర్లు ఉన్నారని, ఇందుకు సంబంధించి ఓటర్ స్లిప్ లను ప్రింట్ చేయడం జరిగిందన్నారు.. ఈ స్లిప్ లను బిఎల్వో ల ద్వారా పంపిణీ చేస్తున్నామని, 8 వ తేదీ లోపు పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు..లోకల్ అథారిటీస్ ఎన్నికలకు సంబంధించి 594 ఐడి కార్డులు సిద్ధం చేయడం జరిగిందన్నారు.. మెటీరియల్ ప్రింటింగ్ మరియు ప్రోక్యూర్ మెంట్ ఈ నెల 6 వ తేదీ లోపు పూర్తి చేస్తామన్నారు.
ఎన్నికల నిర్వహణకు 144 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 141 మంది ఏపీఓ లను నియమించడం జరిగిందన్నారు. వీరికి ఈనెల 2,6 తేదీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 74 పోలింగ్ స్టేషన్లు, టీచర్స్ ఎమ్మెల్సీ కి 27 పోలింగ్ స్టేషన్లు, లోకల్ అథారిటీస్ కి సంబంధించి ఆరు పోలింగ్ స్టేషన్లు, అన్నింటిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. ఇంజనీరింగ్ విద్యార్థులతో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు. లోకల్ అథారిటీస్ ఎన్నికలnకౌంటింగ్కు సంబంధించి ఐదు మంది తహసిల్దార్లను గుర్తించామని, వీరికి ఐదవ తేదీన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.. లోకల్ అథారిటీస్ కి సంబంధించి సిల్వర్ జూబ్లీ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికల నిబంధనల ప్రకారం ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు.. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు నలుగురు తహసీల్దార్లను అనంతపురం జిల్లాకు పంపడం జరుగుతుందని తెలిపారు..పోస్టల్ బ్యాలెట్ నిర్వహణపై గురువారం శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు..72 శాతం ఆధార్ కలెక్షన్ జరిగిందని, త్వరలో ఈ ప్రక్రియ ను పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు.జిల్లాలో 104 పోలింగ్ స్టేషన్ లలో 56 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లు కాగా, 48 సాధారణ పోలింగ్ స్టేషన్ లుగా గుర్తించామన్నారు. లొకేషన్ ల వారీగా 49 కి గాను 27 క్రిటికల్, 22 నార్మల్ లొకేషన్ లుగా గుర్తించడం జరిగిందన్నారు.. భద్రతా చర్యల్లో భాగంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్ ,మొబైల్ టీములు స్టాటిక్ బందోబస్తు టీములు ఏర్పాటు చేశామని వివరించారు.. స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ లో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, డి ఆర్వో నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.