SAKSHITHA NEWS

టీఎస్ఆర్టీసీకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం..

‘హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌’ అందుకున్న డ్రైవర్లను అభినందించిన మంత్రి.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రహదారి భద్రత కేటగిరీలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లోని ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్‌ ఆన్‌ ది రోడ్‌’ పురస్కారాలు అందుకోవడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌(ఏఎస్‌ఆర్టీయూ) ప్రకటించడం పట్ల సంస్థ పై మరింత బాధ్యత పెంచిందన్నారు. ఆయా అవార్డులను కేంద్ర రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్‌, హైవేస్‌ మంత్రి నితిన్‌ గడ్కరీ ఏప్రిల్‌ 18న న్యూఢిల్లీలో ఆయా విజేతలైన కుషాయిగూడ డిపోకు చెందిన కె. రంగారెడ్డి, సూర్యాపేటకు డిపోకు చెందిన కె. సోమిరెడ్డిలకు సంస్ధ తరుపున అభినందనలు తెలియజేశారు. ఈ పురస్కారాలు టీఎస్ఆర్టీసీ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపజేశాయని, సంస్థలోని మిగతా డ్రైవర్లు కూడా వీరి సేవ‌ల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం డ్రైవింగ్ ఒక సవాల్ గా మారిందని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. రోడ్డుపై ప్రయాణించే తోటి వాహనదారుల, పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిస్తూ.. ప్రమాదాల నివారణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీ కారం చుట్టిందన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలోనూ ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. ప్రతి ప్రమాదాన్ని లోతుగా అధ్యయనం చేసి, దానికి గల కారణాలు, నివారణ చర్యలను ఎప్పటికప్పుడు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అంతే కాకుండా, రాష్ట్రంలోని అద్దె బస్సు డ్రైవర్లందరికీ వారం రోజుల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చామని వివరించారు. రాబోయే రోజుల్లో రహదారి భద్రతపైన వినూత్నమైన కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS