Telangana Government’s contribution to the development of film industry
సాక్షిత : చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎప్పటికీ వుంటుంది అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక కళా సంస్థ ఆకృతి నిర్వహణ లో, వెస్ట్ మారేడ్ పల్లి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ 93 వ జయంతి సందర్భంగా సప్త పది చిత్ర కథానాయిక సబిత ను మంత్రి శాలువాతో జ్ఞాపిక తో ఘనంగా సన్మానించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కె విశ్వనాథ్ తెలుగు చలచిత్ర దశ దిశలను మహోన్నత శిఖరాల కు చేర్చిన మహనీయుడు అన్నారు.
ఎందరో కళాకారులు విశ్వనాధ్ చిత్రంలో ఒక్కసారైనా నటించాలని కలలు కంటార నీ, అలాగే ఒక్క చిత్రంలో నటించినా సప్త పది సబిత కు.. ఆయన తో పనిచేసిన మధుర స్మృతులు ఎల్లకాలం గుర్తుండి పోతాయన్నారు.. విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ చలన చిత్ర అభి వృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మా చలం మాట్లాడుతూ స్వతహాగా మంచి నర్తకి అయిన సబిత సప్తపది చిత్రం లో తమ సహజ నటన ను ప్రదర్శించారు అన్నారు.
శంకరా భరణం, సప్తపది చిత్రాల తరువాత సంప్ర దాయ కలలైన నృత్యం, సంగీ తాలను కళా కారులు తమ వృత్తిగా స్వీకరించి ముందు కు వెళుతున్నారు అన్నారు.
సభకు ఆకృతి సుధాకర్ స్వాగతం పలికారు.. కళాభి మానులు ఈ కార్య క్రమం లో పాల్గొన్నారు..