*ఘనంగా చత్రపతి శివాజీ జయంతి నిర్వహించిన ఊరుకొండ పేట గ్రామ యువకులు.
నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండల .
ఫిబ్రవరి 19.
చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పూల మాల వేసి టెంకాయ కొట్టి ఘనంగా నివాలులు అర్పించిన ఊరుకొండపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి దండేత్కర్ అనితనాగోజి
ఊరుకొండ పేట సర్పంచ్ మాట్లాడుతు చత్రపతి శివాజీ మహరాజ్
మహావీరుడు, ధీరుడు,శూరుడు, యుద్ధతంత్ర నిపుణుడు, అన్నింటికీ మించి స్వాభిమానం కల దేశభక్తుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జననం ( 19.2.1630 ). శివ భక్తురాలైన తల్లికి మహాశివుడి ఆశీస్సులతో వీరు జన్మించినందున, శివాజీ అని నామకరణము పొందినారు. తల్లి జిజియా బాయి ఉన్నతమైన పెంపకంతో వీరు బలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. కేవలం 17 సంవత్సరాల వయసులోనే శత్రువులను నిర్జించి రాయగఢ్ ,తోర్నా మరియు కొండానా కోటలను స్వాధీనం చేసుకున్నారు. వీరి పరిపాలనలో మొఘలులా దురాక్రమణ నియంత్రణకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారు.
తుది శ్వాస వరకు శత్రువులకు సింహ స్వప్నంగా వెలుగొందారు. వీరి దేశభక్తి, వీరత్వము, శూరత్వము ప్రజలందరికీ ముఖ్యంగా యువకులకు, విద్యార్థులకు మిక్కిలి ఆదర్శవంతము అని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ అధ్యక్షుడు రామాంజనేయులు ప్రధాన కార్యదర్శి వార్డ్ సభ్యులు రేపని శ్రీను, సిద్దు,అజ్జు,యువ నాయకులు అశోక్ రెడ్డి,మల్లేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, అంజిరెడ్డి, రాజేందర్, శివ, శివాజీ యూత్ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు చిన్నారులు తది తరులు పాల్గొన్నారు