MP Lads Funds for CC Roads and Drains: MP Name
సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎంపీ ల్యాడ్స్ నిధులు: ఎంపీ నామ
సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.40 లక్షలు
సామాజిక వర్గాల వారీగా నిధులు మంజూరు
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం జిల్లాలోని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పెద్ద ఎత్తున ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయిస్తున్నట్లు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపులో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించి,నిధులు మంజూరు చేయడం జరుగుతుందని నామ తెలిపారు. తాజాగా సత్తుపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన విజ్ఞప్తి, వినతి మేరకు నాలుగు మండలాలకు ఆరు సీసీ రోడ్లు, రెండు మురుగు కాల్వల నిర్మాణానికి రూ 40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ.20 లక్షలు, పెనుబల్లి మండలానికి రూ. 10 లక్షలు, తల్లాడ, వేంసూరు మండలాలకు చెరో రూ. 5 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేశామని నామ తెలిపారు. వాటిలో 5 సీసీ రోడ్లు ఎస్సీ సామాజిక వర్గానికి మంజూరు చేయగా రెండు జనరల్, ఒకటి బీసీ సామాజిక వర్గానికి కేటాయించామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా సమగ్రామాభివృద్ధిని సాధిస్తున్నాయని, ఇప్పుడు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉన్నాయని, తద్వారా అన్ని ప్రాంతాలు వేగంగా అభివృద్ధిని సాధిస్తూ శరవేగంగా దూసుకు పోతున్నాయని అన్నారు.
పల్లెలే ప్రగతికి సోపానాలని, అందు కోసం సీఎం కేసీఆర్ గ్రామాభ్యుదయానికి అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. నేడు ప్రతి గ్రామం పట్టణాలతో పోటీ పడుతూ ప్రగతిని సాధిస్తున్నాయని నామ పేర్కొన్నారు.