‘పఠాన్’లో ప్రతి నాయకుడి పాత్రకు జాన్ అబ్రహం మాత్రమే మా ఛాయిస్ :  సిద్ధార్థ్ ఆనంద్‌

SAKSHITHA NEWS

John Abraham is our choice for every lead role in ‘Pathan’: Siddharth Anand

image 100

‘పఠాన్’లో ప్రతి నాయకుడి పాత్రకు జాన్ అబ్రహం మాత్రమే మా ఛాయిస్ :  సిద్ధార్థ్ ఆనంద్‌

షారూక్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘పఠాన్’. రీసెంట్‌గా ఆ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. టీజ‌ర్‌లో గ‌మ‌నిస్తే ప‌ఠాన్ చిత్రంలో జాన్ అబ్ర‌హం షారూక్ ఖాన్ బ‌ద్ద శ‌త్రువు పాత్ర‌లో న‌టించారు. త‌న లుక్ కూడా కూల్‌గా క‌నిపిస్తుంది. అయితే అత‌ను త‌న శ‌త్రువు పూర్తి నాశ‌నం చేయాల‌నుకునే సైనికుడు. ‘ఎలాన్‌తో క‌లిసి జాన్ మాత్రమే అలాంటి పాత్ర‌లో న‌టించ‌గ‌ల‌ని భావించాం. నిజంగానే ఆయ‌న త‌న న‌ట‌న‌తో మ‌మ్మ‌ల్ని థ్రిల్ చేశారు’ అని అన్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘‘ప‌ఠాన్‌’ చిత్రం లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీ. అలాంటి సినిమాలో ధీటైన విల‌న్ ఉండాల‌ని మేం భావించాం. స్క్రీన్‌పై అత‌ని ప్రెజ‌న్స్ ఓ క‌రెంట్‌లాగా ఉండాల‌ని, క్రూర‌త్వంతో కూడినట్టు ఉండాల‌ని మేం ఆశించాం. అందుక‌నే జాన్ అబ్ర‌హంను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర‌ను రాసుకున్నాను’’ అన్నారు.

త‌ను ఇంకా మాట్లాడుతూ ‘‘జాన్ ఈ సినిమాకు మా మొదటి ప్రాధాన్యతే కాదు.. అతను మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేస్తాడని, అతన్నే తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే సినిమాలో ఓ పవర్ ఫుల్ ప్రతి నాయకుడి ఉన్నప్పుడు ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అందుకు తగ్గట్టే టీజర్లో ప్రతి సన్నివేశానికి ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. షారూక్ ఖాన్‌కి పాత్ర‌ను ఢీ కొట్టే న‌ర రూప రాక్ష‌సుడిలాంటి పాత్ర‌కు జాన్ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోశాడు. షారూక్‌, జాన్ అబ్ర‌హం మ‌ధ్య స‌న్నివేశాలు సీట్ ఎడ్జ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తాయి’’ అన్నారు.

‘పఠాన్’ చిత్రం జనవరి 25 2023న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది.


SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

years 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyears 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు. years…


SAKSHITHA NEWS

కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalki

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSకల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalkiకల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు…


SAKSHITHA NEWS

You Missed

yadlapada యడ్లపాడు లో జాతీయ రహదారిసర్వీసు రోడ్డుపై ప్రమాదం.

yadlapada యడ్లపాడు లో జాతీయ రహదారిసర్వీసు రోడ్డుపై ప్రమాదం.

cm తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

cm తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

every village ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి –

every village ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి –

demolished శ్రీ రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన

demolished శ్రీ రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన

govt ప్రభుత్వం ఆస్పటల్ నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు..

govt ప్రభుత్వం ఆస్పటల్ నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు..

death మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి

death మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి

You cannot copy content of this page