SAKSHITHA NEWS

వికారాబాద్ లో ఆర్టిఐ సొసైటీ 5వ సంవత్సర సెలబ్రేషన్స్

సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ 4 వసంతాలు పూర్తిచేసుకుని ఐదవ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా ఆర్టిఐ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మీడియా కన్వీనర్ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ సామాన్యులకు సమాచార హక్కు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కమిటీ అందరి సహకారంతో అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ జిల్లా కోఆర్డినేటర్ విశ్వనాథం, పొలిటికల్ కన్వీనర్ అమరేందర్, నవాబుపేట మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్, ప్రజా పలువురు ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS