‘చెంచల’ టైటిల్ లోగో విడుదల

SAKSHITHA NEWS

విజయ దశమి సందర్భంగా ‘చెంచల’ టైటిల్ లోగో విడుదల

యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాల్లో ఎంతో రియాల్టీ ఉంటుంది. జనాలు కూడా కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. మంచి చిత్రాలను అందిస్తూ శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. నిర్మాత ఏఎన్ బాలాజీ ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం వంటి చిత్రాలతో ఆడియెన్స్‌ను మెప్పించారు. ప్రస్తుతం ఈ బ్యానర్ మీద వరుసగా సినిమాలను నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.

ఈ క్రమంలోనే తమ బ్యానర్లో నిర్మిస్తోన్న చెంచల మూవీకి సంబంధించిన టైటిల్ లోగోను విజయ దశమి సందర్భంగా విడుదల చేశారు. ‘చెంచల’ మూవీ కూర్గ్ ప్రాంతంలో పాము చుట్టూ జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెంచల పాత్రలో ఓ ప్రముఖ కథానాయిక కనిపించబోతోన్నారు.

చెంచల చిత్రానికి జగదీష్ అచార్ దర్శకత్వం వహిస్తుండగా.. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్, సుజిత్ శెట్టిలు సంగీతాన్ని అందిస్తున్నారు.  రామి రెడ్డి కెమెరామెన్‌గా, వెంకీ ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నారు. ఈ సినిమాకు  రచన భార్గవరామ్. డి,  వనమాలి పాటలు రాస్తుండగా.. చిన్ని ప్రకాష్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

 ఈ సినిమా కథ చంచల పాత్రకు, ఓ పాముకు మధ్య సాగుతుంది. చెంచల కుటుంబం ఎలా హత్యకు గురైంది.. తన గతం ఏంటి? పాముతో తనకున్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించబోతోన్నట్టు నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు. ఖర్చుకు ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారభిస్తాం అని నిర్మాత ప్రకటించారు.

ప్రస్తుతం శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రభుదేవా ఫ్లాష్ బ్యాక్, వర ఐపీఎస్, ఛేజింగ్ వంటి చిత్రాలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాయి.


SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

years 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyears 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు. years…


SAKSHITHA NEWS

కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalki

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSకల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalkiకల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page