లస్మన్నపల్లి లో వజ్రోత్సవ ర్యాలి ప్రారంభించిన సర్పంచ్ రాములు
సాక్షిత సైదాపూర్ కరీంనగర్ జిల్లా
సైదాపూర్ /భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, మహిళలు, పాలకవర్గం, విద్యార్థులు, యువకులు ఈ ర్యాలీలో పాల్గొని జై బోలో స్వతంత్ర భారత్ కి జై , జై జై మాత భారత్ మాత, స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు వర్ధిల్లాలి, ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా వంటి తదితర నినాదాలు చేయడం జరిగింది. ఈ ర్యాలీ గ్రామంలోని గ్రామపంచాయతీ నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ…స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇప్పటివరకు 9న గ్రామంలో జాతీయ పతాకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 10న వనమహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం, 11న ఫ్రీడమ్ రన్ చేయడం,12న రాఖీ దినోత్సవం సందర్భంగా మీడియా సంస్థల ద్వారా ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో 15 న ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 16న సామూహిక జాతీయ గీతాలాపన, 17న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం, 18న మండల స్థాయిలో ఫ్రీడం కప్పు పేరుతో క్రీడల నిర్వహణ, 19న హాస్పిటల్స్ వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ, 20 న దేశభక్తి ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీల నిర్వహణ వంటి కార్యక్రమాలతో 22 తేదీ వరకు స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాలు ముగింపు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాయిత రాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఉపసర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, వార్డు సభ్యులు దొనపాటి రమాదేవి, రేగుల సురేష్, మాతంగి వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యులు కొట్టే వెంకట్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ దొనపాటి రామ్ రెడ్డి, అంగన్వాడి టీచర్ స్వరాజ్యం,వివోఏ శ్రీలత, రేషన్ డీలర్ నెల్లి భాగ్యలక్ష్మి, బండ వెంకటరెడ్డి,గ్రామ పెద్దలు మ్యాకల రాజిరెడ్డి,పాల్సాని రాంరెడ్డి, బండ కనకా రెడ్డి, దూదిగుంట రమణారెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది దాసరి రాజు, మాతంగి అంజలి తదితరులు పాల్గొన్నారు.