బొమ్మకల్ గ్రామంలో వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యం తో వజ్రోత్సవ ర్యాలి ప్రారంభించిన సర్పంచ్ ప్రత్యూష
సాక్షిత సైదాపూర్ మండల్ కరీంనగర్ జిల్లా
వే సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఉదయం 9.00 గంటలకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు, వొడితల సతీష్ కుమార్ శాసనసభ్యులు సూచనలతో బొమ్మకల్ గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల భాగస్వామ్యం తో వజ్రోత్సవ ర్యాలి వాడ వాడకు చేయడం జరిగింది. ఒకేరేమిటీ అందరూ దేశభక్తి ఉట్టిపడేలా జాతీయ జెండా చేతబూని, సాగే ప్రవాహం ఇది
ఇట్టి కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా సర్పంచ్ చిట్టి ప్రత్యూష ,రైతు బంధు సమితి అధ్యక్షులు రుద్రారపు రవితేజ ,మాజీ ప్రజాప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డు సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు,మహిళ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.