SAKSHITHA NEWS

రాష్ట్రంలో, వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమలవుతున్న అభివృద్దికి ఆకర్షితులై నూజెండ్ల మండలంలోని తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన T.అన్నవరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందినా పలు కుటుంబాల వారు (13 మంది) శుక్రవారం ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వీరికి పార్టీ కండువాలు కప్పి వారిని వైయస్సార్ కుటుంబములోకి ఆహ్వానించిన అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మరియు వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మేము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చిన సామాజిక వర్గాల వారికి పదవులలో తగిన న్యాయం చేయలేకపోయాయి. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా పదవులలో అన్ని సామాజిక వర్గాల వారికి ఉన్నత పదవులను కేటాయించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కి రాబోయే ఎలక్షన్లో కూడా తమ సహాయ సహాకారాలు అందిస్తామని తెలిపారు. ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల లాగా చూసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న పాలనకి మధ్య అనేక వ్యత్యాసం వచ్చిందని వినుకొండ గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్దిలో దూసుకు వెళ్తుందని ఈ అభివృద్దిని చూసి ఓర్వలేక తమ మనుగడ కోల్పోతారనే భయంతో ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై కోర్టులకు వెళ్తూ అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం అన్నవారు మన ప్రాంతం అభివృద్దికి సహకరించకపోయిన పర్వాలేదు కానీ, అభివృద్దికి అడ్డుపడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మీరు ఎన్ని విధాలుగా అడ్డగించిన వినుకొండ అభివృద్దిని ఆపలేరని నా ప్రాణం ఉన్నత వరకు వినుకొండ ప్రాంత అభివృద్దే లక్ష్యంగా తానూ పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తో పాటు నూజెండ్ల మండల MPP మేడం జయరామిరెడ్డి , ZPTC జడ్డా సుబ్బులు-రామయ్య , మండల కన్వీనర్ నక్కా నాగిరెడ్డి , సొసైటీ చైర్మన్ పొట్లపల్లి పిచ్చిరెడ్డి , మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS