పెత్తందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన
గత ప్రభుత్వం తరహాలో జన్మభూమి కమిటీలు పెట్టి పార్టీ జెండా కడితేనే, లేదా పార్టీలో చేరితేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పెత్తందారీ వ్యవస్థకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
మైలవరం-2 సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం సాయంత్రం పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఈ జగనన్న ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదని, కేవలం అర్హతలు ఉంటే చాలన్నారు. అర్హతల ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరమైన కారణాలు మినహా ఎక్కడా కూడా రాజకీయ కారణాలతో ఏ ఒక్క పథకం కూడా ఆగలేదన్నారు. పేదల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు పెంపొందించాలనే విశాల దృక్పథంతో సీఎం పూర్తిగా పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు. నేడు దేశంలోనే అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి ఘనస్వాగతం లభించింది. మహిళలు హారతులు ఇచ్చి వారి ఇళ్ళకు ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి వారి అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.