SAKSHITHA NEWS

తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు, జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు , నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త… తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 88 వ జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ నివాసంలో జరిగిన జయంతి వేడుకలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన మహానుభావుడు అని, తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని విశ్వవ్యాప్తం  చేసిన మహనీయుడు అని, ఆయన జయంతి ని పురస్కరించుకుని ఆ మహనుభావుడిని స్మరించుకుంటు ఆయన చూపిన బాటలో ప్రయాణిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిద్దాం అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు , ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితమంతా పాటు పడ్డారు .ప్రొఫెసర్  జయశంకర్ సార్ తెలంగాణ కు ఒక దీక్షుచి అని పేర్కొనడం జరిగినది. సార్ జీవితం లో చివరి క్షణం వరకు  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరాయంగా  తపించిన యోధుడని …నాలుగు కోట్ల తెలంగాణ  ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు…  అని కొనియాడడం జరిగినది    ప్రొఫెసర్. .జయశంకర్ సార్ మార్గదర్శం లో ప్రయాణించి ఆయన  కలలు కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ,ఇకముందు సార్ ఆత్మ శాంతించేలా అయిన చూపిన బంగారు తెలంగాణాకై అందరం  కల్సి కట్టుగా పనిచేసి సార్ కలలు కన్నా బంగారు తెలంగాణ లో పునరంకితం కావాలని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది ,అదేవిదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి .కెసిఆర్   బంగారు తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రొఫెసర్ జయశంకర్ యాదిలో అయన ఆశయాలకనుగుణంగా సీఎం కెసిఆర్ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారని ,నిరంతరం ప్రజా సంక్షేమంకోసం  ఎన్నో వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టడమేకాకుండా పేద  ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని ప్రభుత్వ విప్ గాంధీ  చెప్పడం జరిగినది .బంగారు తెలంగాణ సాధనలో భాగంగా ప్రొఫెసర్. జయశంకర్ సార్ మార్గదర్శం లో అయన చూపిన తోవలో  రాష్ట్ర ముఖ్యమంత్రి .కెసిఆర్ అడుగుజాడల్లో ప్రయాణించి బంగారు తెలంగాణను సాధిద్దామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలోవివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, మోజేష్, రాము, యూసఫ్, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS