మహిళా ఎమ్మెల్యేల అవమానంపై బీఆర్ఎస్ నిరసన

Sakshitha news

మహిళా ఎమ్మెల్యేల అవమానంపై బీఆర్ఎస్ నిరసన

మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి జరిగిన అవమానంపై క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలని, ఇది కేవలం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం కాదని, యావత్ తెలంగాణ మహిళలకు జరిగిన అవమానం అని పేర్కొన్నారు.

ప్రతిపక్ష సభ్యుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొంటూ, ఈ పరిణామాలను నిరసిస్తూ 08-09-2026 మంగళవారం ఉదయం 8 గంటలకు బాచుపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ ధర్నాలో నిజాంపేట్ NMC మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ సర్కిల్ BRS పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కాసాని వీరేశ్, కాసాని సుధాకర్, ఆగం రాజు, బాలాజీ నాయక్, గాజుల సుజాత, దేవి చందు మ…