ఉత్తమ అధికారులు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు……………….. జిల్లాసాహితీ కళా వేదిక
సాక్షిత వనపర్తి :
ఉత్తమ అధికారులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వనపర్తికి చెందిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో జాయింట్ డైరెక్టర్ పనిచేసిన జన్ను వెంకటరమణను శనివారం సాహితీ కళా వేదిక ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఉత్తమ అధికారిగా 37 సంవత్సరాల పాటు పనిచేసిన వెంకటరమణ ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేకుండా అధికారుల ప్రజాప్రతిధుల ప్రశంసలను అందుకున్నారని కొనియాడారు.ఆయన ఉద్యోగ జీవితం పలువురికి స్పూర్తివంతమని పేర్కొన్నారు.ఈనాటి కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్, బండారు శ్రీనివాస్,ఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్,గంధం నాగరాజు ,గ్రామ భారతి నిర్వాహకుడు కరుణాకర్ గౌడ్,శ్రీలక్ష్మి,అరుణ, మింటూ ,కల్పన, ముబీన, దివ్య భారతి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY