అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డిపాడేమోసి కడసారి వీడ్కోలు పలికిన…………. మాజీ మంత్ర నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి : ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు తపన పడిన అమ్మపల్లి శ్రీనివాసరెడ్డి తమ అభిమాన నాయకుణ్ణికి కడసారి వీడ్కోలు పలకడానికి పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి అశేషంగా తరలివచ్చిన వారితో అమ్మపల్లి గ్రామమంతా జనసంద్రంగా మారింది
శ్రీనివాస్ రెడ్డి
పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కన్నీటిపర్యంతమై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించి పాడే మోసి కడసారి వీడ్కోలు పలికారు.
శ్రీనివాస్ రెడ్డి మృతి వ్యక్తిగతంగా తనకు,ప్రజలకు,పార్టీకి తీరని లోటని భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు.
మాజీమంత్రి వెంట మాజీ ఎం.ఎల్.ఏ అల.వెంకటేశ్వర రెడ్డి,గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,జగదీశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి,రఘుపతి రెడ్డి,రాజమహేంద్ర రెడ్డి,వేణు యాదవ్,బాలేశ్వేర్ రెడ్డి,కుమార్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్,సేనాపతి,పురుషోత్తం రెడ్డి,చిట్యాల.రాము తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY