ఓపెన్ చెస్ట్ సర్జరీ లేకుండానే అయోర్టా సమస్యకు చికిత్స…
గజ్జల్లో చిన్న కోతతో స్టెంట్- గ్రాఫ్ట్ అమరిక………
వివరాలు వెల్లడించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి……
సాక్షిత సూర్యపేట జిల్లా కోదాడ:
ఛాతీ భాగంలోని అయోర్టా (మహాధమని) సంక్లిష్ట సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఓపెన్-చెస్ట్ సర్జరీ అవసరం లేకుండానే సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌లో ‘థొరాసిక్ ఎండోవాస్క్యులర్ అయోర్టిక్ రిపేర్ ద్వారా అధునాతన చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు. కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాధారణంగా ఓపెన్ అయోర్టిక్ సర్జరీలో ఎక్కువ ప్రమాదం ఉన్న బాధితులకు ఈ మినిమల్లీ ఇన్వేసివ్ చికిత్స ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. గజ్జల్లోని రక్తనాళం ద్వారా క్యాథెటర్‌ను ప్రవేశపెట్టి, ప్రత్యేకమైన స్టెంట్ గ్రాఫ్ట్‌ను దెబ్బతిన్న అయోర్టా వద్దకు చేర్చి లోపల నుంచి సీల్ చేస్తారని తెలిపారు. థొరాసిక్ అయోర్టిక్ అన్యూరిజం, డిసెక్షన్, అల్సర్ వంటి తీవ్ర సమస్యలకు పూర్తి ఆరోగ్య పరీక్షలు, సిటీ యాంజియోగ్రఫీ వివరాలు ఆధారంగా ఈ చికిత్సను నిర్ణయిస్తామన్నారు. నిపుణులైన కార్డియాలజిస్టులు, సర్జన్లు, అనస్థీషియా బృందం సమన్వయంతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ ఉమేష్ అసిస్టెంట్ మేనేజర్ రామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST