SAKSHITHA NEWS

బిజెపి జెండా ఆవిష్కరించిన సంకినేని వెంకటేశ్వరరావు

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సూర్యాపేట పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతోనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు పర్యాయాలుగా అవినీతి లేకుండా దేశంలో పాలన కొనసాగిస్తున్నారు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పై ఒక సంవత్సర కాలంలోనే అన్ని వర్గాల ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఎద్దేవ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, గజ్జల వెంకటరెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు రంగరాజు రుక్మారావు, పట్టణ ఉపాధ్యక్షులు కందుల రమేష్, పట్టణ కార్యదర్శి పంతంగి సాలయ్య, జిల్లా నాయకులు బండ్లపల్లి శ్రీనివాస్, గట్ల ఉమేష్, గిలకత్తుల కరుణాకర్ గౌడ్, కోడి లింగయ్య, అయినాపురపు శ్రీనివాస్, కుoచం సురేష్, రాపోలు ఉపేందర్, ఏక స్వామి, బోర రమేష్ , గన్నోజు భరత్ ,కృష్ణ, శీలం శ్రీనివాస్ , గుండెపురి శివ, పిట్టల వెంకన్న మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు