
పిల్లలతో కలిసి హొలీ పండుగ జరుపుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

హోలీ పండుగ శుభసందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పిల్లలతో కలిసి హొలీ ఆడి రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. రసాయనికి రంగులు వాడకుండా, సహజమైన రంగులతోనే హోలీ పండుగను జరుపుకోవాలని కోరుతూ.. డివిజన్ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app