SAKSHITHA NEWS

రోడ్డు భద్రత,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం:ఎస్సై కురుమయ్య

నర్వ:-రోడ్డు భద్రత,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు నర్వ మండలం పతేర్చేడ్ గ్రామంలో ఉన్న జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో స్థానిక ఎస్సై కురుమయ్య అధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ నియమాలు పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాలు గురించి, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై కురుమయ్య మాట్లాడుతూ రహదారుల పై వాహన దారులు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ సైన్ బోర్డ్ ను గమనిస్తూ వెళ్ళాలని అన్నారు. రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. వాహనదారులు రోడ్డుపై వెళ్తున్నప్పుడు పరిమిత వేగంలో వెళ్లాలని, ద్వి చక్ర వాహనా దారుడు ఎల్మెంట్ ధరించాలని, కార్లలో ప్రయనిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు.అనంతరం సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఉచితలకు ఆశతో మోసపోవద్దు అని, ఈ మెయిల్ లేదా మెసేజ్ లో సామాజిక మాధ్యమాల్లో ప్రకటన కనిపించిన జాగ్రత్త పడండి అని, బ్యాంకులో ఇటువంటి అత్యవసర మార్గాన్ని సృష్టించి మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసాగిస్తారని గుర్తించాలని అన్నారు, పాన్ కార్డు ను అప్డేట్ చేసుకోవడం కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి లాంటి మెసేజ్ లకు ఎవరు కూడా స్పందించవద్దు అని సూచించారు.

కస్టమర్ కేర్ నంబర్ గూగుల్ లో వెతకవద్దు, మీకు లాటరీలు తగిలినాయి, మీ కు లోన్స్ ఇస్తామని, తక్కువ ధరకే ఆన్లైన్ లో వస్తువులు వస్తాయని ఇలా అనేక రకాలుగా మోసాలు జరుగుతాయని కాబట్టి అపరిచిత వ్యక్తులు నుండి కాల్స్ వచ్చినప్పుడు వారి నుండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా బాధితులు సైబర్ నేరం నకు గురైన వెంటనే 1930కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉన్నా వెంటనే పోలీసువారి డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కారాదని ఎవరైనా గుట్కాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసువారికి తెలపాలని, బాల్య వివాహాలు చేయడo వల్ల మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, జరిగే నష్టాల గురించి ఎస్సై తెలియజేశారు.ఎవరైన మొబైల్స్ ను పోగొట్టుకున్నాప్పుడు సీఈఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం గురించీ తెలియజేసారు.ఎవరైనా మహిళలు, విద్యార్థినీ లు వేధింపులకు గురైతే 100 కు ఫోన్ కాల్ లేదా ఎస్సై నెంబర్ 87126 70410 ఈ నెంబర్ కు వాట్సప్ మెస్సేజ్ ద్వారా సమాచారం అందిస్తే వేధింపులకు గురి చేసే వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యoగా ఉంచుతాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app