
పేదల ఇండ్లు కూల్చాటమేనా ప్రజాపాలన…
మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని రాజీవ్ గృహకల్పలో గత 20 సంవత్సరాల నుండి నివసిస్తున్న పేదల ఇళ్లకు ఇరిగేషన్ అధికారులు స్థానిక ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మార్కింగ్ ఇవ్వడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న వెంటనే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ అక్కడికి వెళ్లి స్థానిక ప్రజలతో కలిసి అక్కడ ఇచ్చిన మార్కింగ్లను పర్యవేక్షించి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి సమాచారాన్ని తెలియపరిచారు. అలాగే అక్కడ నివసిస్తున్న ప్రజలకు మీకు అండగా మేముంటాం మీకు ఎటువంటి నష్టం కలగకుండా చూసే బాధ్యత మాపై ఉంది మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావొద్దు మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం అని వారికి భరోసా ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app