
కంభం పరిదిలోని ఎక్సైజ్ శాఖ గీత కులాలకు మద్యం దుకాణాల కేటాయింపు గురించి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు
కంభం ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ ఇన్స్పెక్టర్. ఈ సందర్బంగా స్టేషన్ కు సంబంధించిన వివరాలను తెలియజేయడం జరిగింది.
కంభం పరిధిలో రెండు మద్యం దుకాణాలు గీత కులాలకు కేటాయించడం జరిగినది 1) బేస్తవారిపేట మండలం (GOUD – లైసెన్స్ ఫీజు 32.5 లక్షలు) 2) అర్ధవీడు మండలం (GOWDA – లైసెన్స్ ఫీజు 27.5 లక్షలు)
ప్రభుత్వ నిబంధనల మేరకు వారు షాపులకు టెండర్లు వేయవచ్చని అయితే ఏ షాపు కోసం ఏ ప్రాంతం వారు టెండర్లు వెస్తున్నారు దానికి ఓ నెంబరు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు
ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు దరఖాస్తు రుసుము 2 లక్షలు అన్ లైన్ ద్వారా బ్యాంకు ల నుంచి డి డి ల రూపంలో చెల్లించవలెనని తెలియజేశారు. గౌడ కులానికి చెందిన ఒక జిల్లాకు చెందిన వ్యక్తి ఆ జిల్లాలోనే అప్లికేషన్ వేయవలెను మరొక జిల్లాలో అప్లికేషన్ వేయడం కుదరదు. ఒక వ్యక్తికి లాటరీలో ఒకటికంటే ఎక్కువ వచ్చినట్లయితే సదరు వ్యక్తికి ఒక షాపును మాత్రమే కేటాయించడం జరుగుతుంది.
ఈ నగదు పూర్తిగా నాన్ రిఫండబుల్ నగదని దరఖాస్తు దారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు
ఈ టెండర్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని వేసిన టెండర్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ సమక్షంలో తెరవబడతాయని వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని తెలియజేశారు
ప్రభుత్వ విధి విధానాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దీని ప్రకారం షాపులను కేటాయింపు చేస్తామని తెలిపారు. అప్లికేషన్ యొక్క చివరి తేదీ.05-02-2025 మరియు లాటరీ నిర్వహించు తేదీ 07-02-2025.
పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలియజేశారు. ఏవైనా సందేహాలు ఉన్న ఎడల ఎక్సైజ్ స్టేషన్ కంభం సందర్శించి నివృత్తి చేసుకోగలరు
ఇట్లు కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. S. కొండారెడ్డి.9440902508.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app