
నారా లోకేష్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన తెదేపా నాయకులు
సాక్షిత వనపర్తి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ 42వ పుట్టినరోజు పురస్కరించుకొని వనపర్తి నియోజకవర్గ తెదేపా నాయకులు పార్టీ కార్యాలయంలో కేకును కట్ చేసి తమ హృదయ యువనేత నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగాముగా నిలవాలని తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి క్షేమాన్ని కై నిరంతరం కృషి చేయాలని అందుకు ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీను వాసులు, కాగితాల లచ్చన్న, హోటల్ బలరాం కొత్తగొల్ల శంకర్ డి బాలరాజ్ ఎండి ఫరూక్ రాజు తదితరులు పాల్గొన్నారు
