
మోండా మార్కెట్ లోని తన నివాసంలో కోలుకుంటున్న సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ ను సాయంత్రం మాజీ మంత్రి, సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు, బీ.ఆర్.ఎస్. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఇతర నాయకులు పరామర్శించారు. పద్మారావు గౌడ్ అస్వస్థత సమాచారం తనను ఆవేదనకు గురి చేసిందని, ఆయన త్వరగా పుర్తిగా కోలుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు
