SAKSHITHA NEWS

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడును అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
నూతన ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావుకు మంత్రి రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాదును మంత్రి ఘనంగా సత్కరించారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాడెల్టా సమగ్ర అభివృద్ధితో పాటు, డెల్టాలో దిగువ ప్రాంతాల సాగునీటి సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం తొలిసారి దిగువ ప్రాంత నాయకునికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగైదు వేల ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో పంటకు నోచుకోని ప్రాంత రైతుగా వెంకటేశ్వరరావుకు అవకాశమిచ్చామని చెప్పారు.
నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీయిచ్చారు. రాష్ట్రంలో ఆర్దిక సమస్యలు ఉన్నప్పటికీ సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అవుట్ ఫాల్ స్లూయిజులను నాబార్డు ద్వారా నిర్మించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే నియోజకవర్గానికి వస్తానని చెప్పారు.


SAKSHITHA NEWS