SAKSHITHA NEWS

కొద్దిసేపట్లో పోలీసులకు విచారణకు అల్లు అర్జున్

హైదరాబాద్ :
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనం తరం బెయిల్ పై బయటికి వచ్చిన అల్లు అర్జున్ కి తాజాగా.. మరోసారి విచారణకి రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇందులో భాగంగానే 11 గంటలకి అల్లు అర్జున్ విచారణకు హాజరు కానున్నారు. విచారణకి వెళ్లే సమయం దగ్గర పడడంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.

విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నారు. ఇక నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చాక తన లీగల్ టీమ్‌తో కూడా చర్చించాడు అల్లు అర్జున్.

కాగా సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే వీడియోలు కూడా విడుదల చేశారు పోలీసులు. మరి విచారణలో ఎటువంటి నిజాలు బయటికొస్తాయో చూడాలి!