SAKSHITHA NEWS

| కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా నిజాంపేట్ రాజీవ్ గృహ కల్పకు బస్సు సౌకర్యం కల్పించిన కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహ కల్ప గత 10సం || బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతు గత ప్రభుత్వంలో ఎంతోమంది నాయకులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకొనే దఖలు లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి వారి బాధలను విన్నపించుకోగా కూకట్ పల్లి డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కలిపించించారు .

ఈ సందర్బంలో కాలనీ వాసులు హన్మంతన్నకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతు కాంగ్రెస్ హయంలో నిర్మించిన రాజీవ్ గృహ కల్ప కాలనీ కి మల్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన సంబరాలలో బస్సు సౌకర్యం కలిగినందుకు ఆనందం వ్యక్తం చేసారు. అలానె ప్రభుత్వ చౌక దారుల దుకాణ సందర్శించి గడిచిన మొదటి సం|| లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, మైనారిటీ అధ్యక్షులు అంజద్, లక్ష్మణ్, ప్రభాకర్ రెడ్డి , రాంచందర్ నాయక్, రవి, మర్తమ్మ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS