భారీ ఎన్ కౌంటర్ జరిగిన రాత్రే వాజేడు ఎస్సై ఆత్మహత్య?
ములుగు జిల్లా:
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు ముందు నిన్న ఓ యువతితో ఎస్సై రిసార్ట్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది.
అయితే ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండటంతో మనస్థాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు..
గత నెలలో ఈయన విధులు నిర్వహిస్తున్న పీఎస్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో ఇద్దరిని హత్య చేసారు. అప్పటి నుండి హరీష్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం.
భారీ ఎన్కౌంటర్ జరిగిన మరుసటిరోజే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్సై ఆత్మహత్య కలకలం రేపుతుంది, ఎస్సై హరీష్ ఆత్మహత్యకు?ఎన్కౌంటర్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.