SAKSHITHA NEWS

వయానాడ్ లో వార్ వన్ సైడ్

హైదరాబాద్:
వయనాడ్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతోపాటు ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయా లలో పోటీ చేయకపోవడం ఇక్కడ ఆమెకు ప్లాస్ పాయింట్స్ అని చెప్పవచ్చు.

అందుకే కౌంటింగ్ షురూ అయిన రెండు గంటల్లోనే 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయపథంలో దూసుకెళ్తున్నారు ప్రియాంక గాంధీ. వయనాడ్ లోకసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకగాంధీ పోటీ చేస్తుండటంతో సిట్టింగ్ అభ్యర్థిని కాకుండా బీజేపీ నవ్య హరిదాస్ అనే మహిళను బరిలోకి దింపింది.

తొలిరౌండ్ నుంచి ప్రియాంకగాంధీ లీడ్ లో ఉండటమే కాదు ప్రత్యర్థు లు ఎవరు కూడా ఆమెకు పోటీ ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 12:30 గంటల వరకు సుమారు 3, 19వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగు తున్నారు.

ఇది కంటిన్యూ చేస్తే వయానాడ్ నుంచి ప్రియాంక నాలుగు లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

వయనాడ్ లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబు రాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రియాంకకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.


SAKSHITHA NEWS