వరి అమ్మిన రైతుకు సకాలంలో డబ్బులు అకౌంటుకు జమ అయినాయా లేదా అనే స్వయంగా ఫోన్ చేసి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్
సాక్షిత వనపర్తి :
పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వి. ఎస్.ఎన్ .వి. ప్రసాద్ వనపర్తి జిల్లాను ఆకస్మికంగా సందర్శించి మదనాపూర్ లోని ఐ.కే.పి వరి కొనుగోలు కేంద్రాన్ని, తిర్మలయపల్లి, కొత్తకోట లో పి.ఏ.సి.ఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అదనపు కలక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు తో కలిసి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన రైతుకు డబ్బులు వారి ఖాతాలో జమ అయినాయా అని ఆరా తీయగా డబ్బులు జమ చేయడం జరిగిందని నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. ఒక రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగి డైరెక్టర్ నేరుగా రైతుతో ఫోన్ లో మాట్లాడారు. అమ్మిన ధాన్యానికి త్వరగానే డబ్బులు జమ అయ్యాయి అని రైతు సమాధానం ఇవ్వడంతో డైరెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సుగురు గోదాము ను సందర్శించి ధాన్యం నిల్వకు ఉన్న అవకాశాలు, నిల్వలను పరిశీలించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్ తదితరులు డైరెక్టర్ వెంట ఉన్నారు.