SAKSHITHA NEWS

సాక్షిత : గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

సూర్యాపేటలో మొత్తం 30 సెంటర్లు ఏర్పాటు చేశాం

8951 అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

సూపర్ ఇంటెండెంట్ బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహన కల్పించిన : జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వర రావు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ -III పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపర్ ఇంటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు రూట్ ఆఫీసర్లు కు రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డా. వెంకటేశులుతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. ఈనెల 17 ,18 తేదీలలో నిర్వహించే గ్రూప్ III పరీక్షకు సూర్యాపేటలో మొత్తం 30 పరీక్ష కేంద్రాలు ఉండగా 8951 విద్యార్థులు పరీక్ష కు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రానికి అనుమతించేటప్పుడు విద్యార్థుల హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డును తనిఖీ చేసి పంపాలని పేర్కొన్నారు . మొత్తం 68 బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ను అందుబాటులో ఉంచామని ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఫర్నిచర్ ,త్రాగునీరు మెడికల్ కిట్ అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులకు అనుమతి లేదని అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుర్తు చేశారు.

WhatsApp Image 2024 11 13 at 4.33.24 PM

SAKSHITHA NEWS