SAKSHITHA NEWS

సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులు,మండల నాయకులతో కలిసి మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రారంభించారు.*

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..

రైతులకు కోనుగోలు కేంద్రానికి సంబంధించి స్థలం లేదని నాదృష్టికి తీసుకువచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి స్థలం కేటాయించడం జరిగిందని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చూడాలని,ఎటువంటి ఇబ్బందీ ఉన్న తన దృష్టికి తీసుకురావాలని,మార్కెటింగ్ అధికారులు,మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలనీ, రైతులకు ఇప్పటికే సుమారు 85 శాతం రుణమాఫీ అయ్యింది మిగతా 15 శాతం మంది రైతులకు రుణ మాఫీ చేస్తుంది వర్తించని రైతులకు రుణమాఫీ జరిగేలా చూసే బాధ్యత తనే స్వయంగా తీసుకుంటానని,దీని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 11 12 at 4.23.06 PM

SAKSHITHA NEWS