ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు “కె.ఎం.పాండు” …
చింతల్ లో నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య కుత్బుల్లాపూర్ మాజీ చైర్మన్ కె.ఎం. పాండు 6వ వర్ధంతి కార్యక్రమం…
చింతల్ ప్రధాన రహదారి పాండు మార్గ్ లో కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత నేత “కె.ఎం.పాండు” 6వ వర్ధంతి సందర్బంగా కె.ఎం.పాండు విగ్రహానికి వారి తనయుడు, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సంధర్బంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత నేత కె.ఎం.పాండు తో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం – విద్యతోనే అసమానతలను తొలగించవచ్చని నమ్మిన గొప్ప సంఘసంస్కర్త దివంగత నేత కె.ఎం.పాండు అని అన్నారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా జాతీయ సమైక్యత, దేశ రక్షణ కోసం 1965లోనే జాతీయ రక్షణ నిధికి విరాళాలను అందించిన మహా నేత అని అన్నారు. యువ కార్మిక నాయకుడిగా కార్మిక, కర్షక వర్గాల పక్షాన సేవిల్లా నగరంలో జరిగిన మహాసభలకు హాజరై కార్మికుల బాధలను ప్రపంచానికి చాటిన కార్మిక పక్షపాతి అని అన్నారు. కుత్బుల్లాపూర్ లోని ఎంతోమంది నాయకులకు రాజకీయ ఓనమాలు నేర్పిన రాజకీయ దురందరుడు పాండు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.