SAKSHITHA NEWS

త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు అనిత

AP: మహిళలు, చిన్న పిల్లలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులకు దొరకకుండా నేరస్థులు తప్పించుకుంటున్నారని చెప్పారు. తమ ముందు చాలా టాస్క్లు ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాలోనూ సోషల్ మీడియా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.


SAKSHITHA NEWS