యాదవుల సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
సాక్షిత ప్రతినిధి కోదాడ,అక్టోబర్ 26:కోదాడలో నవంబర్ మూడో తారీఖున బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న యాదవుల సదర్ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం స్థానిక డైన్ ఇన్ హోటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చిన్న శ్రీశైలం యాదవ్ విచ్చేసి మాట్లాడినారు.కోదాడ,హుజూర్ నగర్ సదర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నవంబర్ మూడో తారీఖున జరుగుతున్న యాదవుల సదర్ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా,యాదవులలో ఆర్థిక,సామాజిక,రాజకీయ చైతన్యం కొరకు ఈ సదర్ సమ్మేళనం ముఖ్యపాత్ర పోషిస్తూ ఒక వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్ కమిటీ అధ్యక్షులు,బొల్లం సిద్దు యాదవ్,కోఆర్డినేటర్ బత్తుల కిట్టు యాదవ్,హుజూర్ నగర్ కమిటీ అధ్యక్షులు జక్కుల నరేందర్ యాదవ్,కోఆర్డినేటర్ మారాల వీరబాబు యాదవ్,కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్,వైస్ ప్రెసిడెంట్ బొమ్మ సాయి యాదవ్ తదితర యాదవ మేధావులు పెద్దలు నాయకులు యువత పాల్గొన్నారు.