రైతులను మోసం చెయ్యడమే పని గా పెట్టుకున్న పత్తి కొనుగోలు వ్యాపారులు
- వంగపల్లి లో పత్తి రైతు ను మోసం చేసిన వ్యాపారులు
- కేసు నమోదు చేసిన – సిఐ హరికృష్ణ
కమలాపూర్ సాక్షిత
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన సానబోయిన అశోక్ అంబాల గ్రామానికి చెందిన గుండ్ర రాజ్ కుమార్ అను ఇద్దరు యువకులు గత కొద్ది కాలంగా ట్రాలి లో ఊర్లలో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. రైతులను మోసం చేసి సులభంగా డబ్బులు సంపాదించాలనే మూర్ఖత్వమైన ఆలోచన తో రిమోట్ సెన్సార్ కీ తో బరువును తగ్గించే విధంగా ప్లాన్ చేసుకొని రైతులను మోసం చేస్తూ శూనకానందం పొందుతున్నారు. అయితే వంగపల్లి గ్రామానికి చెందిన కొలిపాక కుమారస్వామి అనే రైతు తన వద్ద ఉన్న పత్తిని అమ్మడానికి నిర్ణయించుకున్నాడు.
అయితే ఆ గ్రామానికి వచ్చిన పత్తి కొనుగోలు వ్యాపారులకు అమ్ముతుండగా తూకం వేసే సమయం లో బరువు సరిగ్గా చూపించకపోవడం తో గమనించిన రైతు మరొక ఎలక్ట్రానిక్ కాంటతో చూడగా పది కేజీల తూకం తేడా రావడంతో ఇలా వస్తుందేంటి అని ఆ యువకులను ప్రశ్నించి వారి జేబులో వెతకగా రిమోట్ సెన్సార్ కీ ఉంది దానితో వారు ఆపరేట్ చేస్తుంటే పది కిలోల బరువు తగ్గుతుండడం గమనించిన రైతు కమలాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా కమలాపూర్ సిఐ హరికృష్ణ తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి శ్రీలతకు సమాచారం అందించగా ఎలక్ట్రానిక్ కాంట తో ఎలా మోసం చేస్తున్నారో ప్రత్యక్షంగా మోసగాళ్ళతో చేసి చూపించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతు కొలిపాక కూమారాస్వామి ఇచ్చిన పిర్యాదు మేరకు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి ఆటో ట్రాలి ని సీజ్ చేశామని కమలాపూర్ సిఐ హరికృష్ణ తెలిపారు.