సూర్యాపేటలో అయ్యప్ప మాలధారణ కార్యక్రమం
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధారణ కార్యక్రమాన్ని స్వాములు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురుస్వాములు కంచుకోమ్ముల కృష్ణ (19వ పడి), గుండెబోయిన సైదులు ఆధ్వర్యంలో స్వాములకు మాలాధారణ చేసి, అయ్యప్ప మాల స్వీకరించిన తరువాత 41రోజులు (మండల దీక్ష ) కు పాటించవలసిన కఠినమైన నియమనిబంధనల గురించి గురు స్వాములు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గోలి సుధాకర్ స్వామి, రాచకొండ దేవయ్య గురు స్వామి, అయ్యప్ప దేవాలయ అర్చకులు రెంటాల సతీష్ శర్మ, జేపీటీ గురు స్వామి. మాలధారణ స్వేకరించిన స్వాములు మణికంఠ, రమేష్ చారి, అనుదీపు, శివ, పాల్గొన్నారు.