నగరపాలక సంస్థలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
తిరుపతి నగరపాలక సంస్థ
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మహర్షి శ్రీ వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ హిందువుల గొప్ప ఇతిహాసమైన రామాయణాన్ని రచించిన గొప్ప మహనీయుడు వాల్మీకి అన్నారు. ఆయన రచించిన రామాయణం మన జీవిత అభ్యున్నతికి ఎంతో ఉపయోగకరమని అన్నారు.
ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాలని అన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతిని నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్స్ సేతుమాధవ్, రవి, సెక్రటరీ రాధిక, మేనేజర్ హసీమ్, తదితరులు పాల్గొన్నారు.