SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాష్టమి సందర్భంగా నిర్వహించినటువంటి చండీ హోమం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు కలిగించాలని వేడుకున్నారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలవడం ద్వారా చేపట్టిన ప్రతి కార్యంలో విజయం చేకూరుతుందన్నారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేపట్టిన ప్రతీసారి అమ్మవారు ఒక్కో అవతారంలో వచ్చి ప్రజలను కాపాడిన రూపాలే నవదుర్గ రూపాలని అన్నారు. అనంతరం ఆలయ ఈఓ శాలువాతో సత్కరించారు, ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ మరియు భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS