సద్దుల బతుకమ్మ వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సద్దుల బతుకమ్మ వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
పూల పండుగకు వేళయ్యింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమరవీరుల స్మారకస్థూపం నుండి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు సాయంత్రం 4గంటల నుండి రాత్రి 11గంటల వరకు కొనసాగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసులు అధికారికంగా ప్రకటించారు.